గోరికొత్తపల్లిలో మండల స్థాయి క్రీడా పోటీలు

గోరికొత్తపల్లిలో మండల స్థాయి క్రీడా పోటీలు

BHPL: రేగొండ, గోరికొత్తపల్లి మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం ఈ నెల 12 నుంచి మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారులు సట్కూరి రాజు, వేల్పుల ప్రభాకర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గోరికొత్తపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఈ పోటీలు జరుగనున్నాయని వారు పేర్కొన్నారు.