జిల్లాలో భారీ వడగళ్ల వాన

కామారెడ్డి: ఆదివారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా వడగళ్ల వాన కురిసింది. చిన్నమల్లారెడ్డి, పాతరాజంపేట్, సరంపల్లి, పొందుర్తి, గురు రాఘవేంద్ర కాలనీలు అకస్మాత్తుగా కురిసిన వర్షం భీభత్సం సృష్టించింది. అన్ని కూడళ్లు జలమయంతో పాటు వరదలు ప్రవహించాయి. కొందరు గాలి వర్షంతో కురిసిన వానలో పెద్ద పెద్ద ఐస్ ముక్కలు కుప్పలు తెప్పలుగా పడ్డాయి.