రేపు గంగారం మండలంలో పర్యటించనున్న మంత్రి సీతక్క

రేపు గంగారం మండలంలో పర్యటించనున్న మంత్రి సీతక్క

MHBD: మహబూబాబాద్ జిల్లా గంగారం మండల కేంద్రంలో రేపు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించనున్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి సీతక్క ప్రారంభించి, ఉచితంగా మందులను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రామనాథ్‌తోపాటు, తదితర అధికారులు పాల్గొననున్నారు.