కార్యకర్తకు నివాళి అర్పించిన ఎమ్మెల్యే

కార్యకర్తకు నివాళి అర్పించిన ఎమ్మెల్యే

ATP: బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త శివానంద రోడ్డు ప్రమాదంలో మరణించారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన భౌతిక కాయానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.