'నందికొట్కూరులో ఎరువుల కొరత లేదు'

NDL: నందికొట్కూరు మండలంలో యూరియా ఏరియాలో కొరతలేదని వ్యవసాయ అధికారి షేక్షావలి తెలిపారు. ఇందులో భాగంగా ఆయన మంగళవారం మాట్లాడుతూ.. మండలంలో రైతులకు అవసరమైన ఎరువులు ఆయా గ్రామాలలో ఉండే రైతు సేవ కేంద్రాలలో నిలువ చేశామని తెలిపారు. ఈ మేరకు ఏ మండలానికి చెందిన రైతులు అక్కడనే ఎరువులు తీసుకోవాలని ఆయన సూచించారు.