ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో బీజేపీ వ్యూహం!

రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా బీజేపీ మూడు ముఖ్య వ్యూహాలను అనుసరిస్తోంది. దక్షిణాదికి ప్రాధాన్యత ఇస్తున్నామనే సంకేతాలు ఇవ్వడం, విపక్షాల్లో చీలిక తీసుకురావడం సహా 8 జిల్లాల్లోని 60 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రభావం చూపే గౌండర్ కులానికి చెందిన రాధాకృష్ణన్‌తో వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను దెబ్బకొట్టడం ఈ వ్యూహాల్లో భాగం.