VIDEO: కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
అన్నమయ్య: మదనపల్లెలోని బీటీ కళాశాలను జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైబ్రరీతో పాటు వివిధ భవనాల పరిస్థితులను ఆయన పరిశీలించారు. కొత్త కలెక్టరేట్ ఏర్పాటుకు అనువైన భవనాలను పరిశీలించే క్రమంలో ఈ సందర్శన జరిగింది. ఈ తనిఖీలో సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి, తహసీల్దార్ కిషోర్‌కుమార్ రెడ్డి, ఎలక్షన్ డ్యూటీ అధికారి రాఘవ తదితరులు పాల్గొన్నారు.