VIDEO: సూర్యప్రభ వాహనంపై చెన్నకేశవ స్వామి దర్శనం
మార్కాపురం జిల్లా కేంద్రంలో వెలిసిన చెన్నకేశవ స్వామి రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రధాన అర్చకులు అప్పనాచార్యులు స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తెల్లవారుజామున 5:30 గంటల నుంచి సూర్యప్రభ వాహనంపై పురవీధులలో చెన్నకేశవ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఊరేగింపు సమయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.