ఉచిత బస్సు పథకంపై బీజేపీ నేత ఘాటు వ్యాఖ్యలు

HYD: ఫ్రీ బస్ స్కీంపై బీజేపీ నేత మాధవి లత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ఉపాధి కల్పించాలని, ఉద్యోగాలు ఇవ్వకుండా ఉచిత బస్సు పెడితే మహిళలు ఎక్కడ తిరగాలి అంటూ ప్రశ్నించారు. ఇంట్లో టిఫిన్ డబ్బా కట్టుకొని బస్సులలో తిని తిరిగి ఇంటికి రావాలా అంటూ వ్యాఖ్యానించారు. ఫ్రీగా బస్సు ఎక్కిన మహిళ ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు.