'పేదల వైద్య విద్యను కాపాడాలి'
VSP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపి పేదల వైద్య విద్యను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం సౌత్ క్రిస్టియన్ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో చిన్న దుర్గాలమ్మ గుడి వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజల నుంచి సంతకాలు తీసుకున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.