లాడ్జీల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి: డీఎస్పీ

TPT: శ్రీకాళహస్తిలోని లాడ్జీ యజమానులు, మేనేజర్లతో డీఎస్పీ నరసింహమూర్తి బుధవారం సమావేశం నిర్వహించారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టడం, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. గెస్ట్‌ల వివరాలు నమోదు, సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని సూచించారు. భద్రతాపరంగా లాడ్జీ యజమానులు తమకు సహకరించాలని కోరారు.