ఒకేసారి 20 మందిని కరిచిన పిచ్చికుక్క

ప్రకాశం: దర్శి పట్టణంలో ఆదివారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. పొదిలి రోడ్డులో ఏకంగా 20 మందిపై దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకేసారి ఎక్కువ మంది కుక్కకాటుకు గురికావడంతో అధికారులు వ్యాక్సిన్ల కోసం ఇబ్బంది పడ్డారు.