ఎస్.కోటలో రెండు బైకులు ఢీ.. బాలుడు మృతి

ఎస్.కోటలో రెండు బైకులు ఢీ.. బాలుడు మృతి

VZM: శృంగవరపుకోట టౌన్ పరిధిలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో 17ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు సీఐ నారాయణమూర్తి తెలిపారు. బద్దు మహేందర్ రెడ్డి తన బండిపై విశాఖ-అరకు హైవే దాటుతుండగా, బాడితబోయిన దుర్గాప్రసాద్(17) బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలతో బాలుడు మృతి చెందగా.. మహేంద్ర రెడ్డి విజయనగరంలో చికిత్స పొందుతున్నాడు.