లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆర్డివోకు ఏఐటీయూసీ వినతి
NLG: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ నాయకుడు నూనె రామస్వామి ఆధ్వర్యంలో దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డికు మెమోరాండం సమర్పించారు. కొత్త చట్టాల వల్ల పని గంటలు 12కు పెరుగుతాయని ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాత కార్మిక చట్టాలనే కొనసాగించాలని కార్మికులంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.