కాంగ్రెస్‌తోనే పట్టణ అభివృద్ధి: మాజీ డీసీసీ అధ్యక్షుడు
KMR: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పట్టణ అభివృద్ధి చెందుతుందని, మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం 33వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ముప్పారపు ఆనంద్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పున్న రాజేశ్వర్, నిట్టు వేణుగోపాలరావు పాల్గొన్నారు.