గిల్ డిశ్చార్జ్.. రెండో టెస్టు ఆడేది సందేహమే?
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో మెడకు గాయం కావడంతో శుభ్‌మన్ గిల్ 'రిటైర్డ్ హర్ట్'గా వెనుతిరిగాడు. దీంతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ప్రస్తుతం గిల్ డిశ్చార్జ్ అయ్యాడు. అయితే, గాయంతో గిల్ బ్యాటింగ్ చేయలేకపోవడం భారత జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపింది. కాగా, రాబోయే రెండో టెస్టులో అతడు పాల్గొనే విషయంపై అనిశ్చితి కొనసాగుతోంది.