'మొక్కజొన్నను మద్దతు ధరకు విక్రయించాలి'
KMM: మొక్కజొన్నలకు కేంద్ర ప్రభుత్వం రూ.2,400 మద్దతు ధర ప్రకటించిందని, రైతులకు మద్దతు ధర దక్కేలా జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది వానాకాలంలో జిల్లాలో 1,705 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని, ఈ పంట కొనుగోలుకు జిల్లాలో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.