పశువులకు గాలికుంటు టీకాలు
WGL: పర్వతగిరి మండలం రావూరు గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. శుక్రవారం పశు వైద్యాధికారి డాక్టర్ రాజు మాట్లాడుతూ.. పశువులకు ఈ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. గ్రామంలో మొత్తం 89 పశువులకు టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భద్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.