ఎయిర్‌పోర్టుల్లో జీపీఎస్ స్పూఫింగ్ నిజమే: కేంద్రం
ఇటీవల ఢిల్లీ సహా పలు విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్య కారణంగా వందల సంఖ్యలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇలా అంతరాయం ఏర్పడటానికి జీపీఎస్ స్పూఫింగ్, జీఎన్‌ఎస్‌ఎస్ జోక్యమే కారణమని కేంద్రం ధ్రువీకరించింది. ఈ మేరకు పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్రం వివరణ ఇచ్చింది.