VIDEO: చెట్టుపై నుంచి పడి రైతుకు తీవ్ర గాయాలు
అన్నమయ్య: తంబళ్లపల్లి మండలం పులసంవాండ్లపల్లిలో ప్రమాదం చోటుచేసుకుంది. చింత చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా రైతు శివకుమార్ నాయుడు ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే తంబళ్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.