శంకర్ గౌడ్ మృతికి నివాళి
SGR: ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు శుక్రవారం నివాళి అర్పించారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కార్మికులు ఎవరు కూడా ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని కోరారు. పోరాటం ద్వారానే సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పారు.