వేసవిలో తాగునీటి ఎద్దడి రానీయొద్దు: కలెక్టర్

వేసవిలో తాగునీటి ఎద్దడి రానీయొద్దు: కలెక్టర్

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆర్డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. బుధవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాగునీటి పైప్‌లైన్‌ల లీకేజీలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.