కొనకనమిట్లలో 5 సెకండ్ల పాటు కంపించిన భూమి
ప్రకాశం: కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాల్లో భూకంపం వచ్చినట్లు పలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3: 30 సమయంలో పెద్ద శబ్దంతో ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలియచేశారు. గృహల్లోని వస్తువులు సైతం కదిలినట్లు చెప్తున్నారు. ఆ సమయంలో నిద్రలో నుంచి లేచి భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నారు.