విరాట్‌ కోహ్లీ ఓ అద్భుతం: అంబటి రాయుడు

విరాట్‌ కోహ్లీ ఓ అద్భుతం: అంబటి రాయుడు

భారత క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ ఓ అద్భుతమని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నాడు. 'విరాట్ టీమిండియా కోసం ఎంతో చేశాడు. భారత జట్టు రాబోయే వందేళ్లలో ఆధిపత్యం చెలాయించేలా బాటలు వేశాడు. అతడికి ఎంతో నైపుణ్యం ఉంది. దాంతోపాటు చక్కటి ఫిట్‌నెస్‌ అతడి సొంతం. అతడి వల్లే ఫిట్‌నెస్‌లో భారత జట్టు అత్యున్నత ప్రమాణాలను అందుకుంది' అని అంబటి విశ్లేషించాడు.