చేనేత సహకార ఎన్నికల నిర్వాహణకు సర్కార్ కసరత్తు

చేనేత సహకార ఎన్నికల నిర్వాహణకు సర్కార్ కసరత్తు

SRCL: రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వాహణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, బకాయిదారుల వివరాలను ఏప్రిల్ 4-13 వరకు నోటీసుపై ప్రచురించనున్నారు. ఓటు హక్కు కావాలనుకుంటే వచ్చేనెల 13లోగా బకాయిలు చెల్లించాలని గడువు విధించారు. అదేనెల 18-25 వరకు ఓటరు జాబితా విడుదల చేస్తారు. జూన్‌లో చేనేత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.