విద్యార్థిని చితకబాదిన టీచర్

విద్యార్థిని చితకబాదిన టీచర్

GDWL: అయిజ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నవోదయ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థి చరణ్ తేజను ఓ ఉపాధ్యాయుడు గురువారం చితకబాదాడు. దెబ్బలకు తట్టుకోలేక విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడిని నిలదీశారు. చదువు చెప్పమని పంపితే అమానుషంగా కొట్టడం ఏమిటని ప్రశ్నించారు.