ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తారా?

చదువుకున్న చదువుకు సరైన ఉద్యోగం లభించకపోతే విదేశాలకు వెళ్లాలని కొందరు భావిస్తుంటారు. అయితే, అలాంటి వారికోసం న్యూజిలాండ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రెజిల్, డెన్మార్క్, బోత్సవానా, కెనడా, కాంబోడియాలో ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయం, టెక్నాలజీ, టూరిజం, మార్కెటింగ్, ఇంజినీరింగ్, ఫైనాన్స్, ఇంధనం, బయోటెక్ రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.