అక్రమ నిర్మాణాలు తొలగింపు

VZM: కొత్తవలస పట్టణ కేంద్రం సర్వే నెంబర్ 142/1పి వాగులో(ప్రభుత్వభూమి) నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యక్తి శాశ్వత గృహ నిర్మాణం చేపడుతుండడంతో తహసీల్దార్ పి.అప్పలరాజు, సిబ్బందితో పునాదులను శుక్రవారం రాత్రి జేసీబీ సహాయంతో తొలగించారు. ప్రభుత్వ భూములలో శాశ్వత నిర్మాణాలు చేపడితే ఉపేక్షించబోమని తహసీల్దార్ హెచ్చరించారు. రెవెన్యూ పరిశీలకులు షణ్ముఖరావు పాల్గొన్నారు.