ఎన్-క్యాప్ నిధులతో అత్యాధునిక పార్క్ నిర్మాణం

ఎన్-క్యాప్ నిధులతో అత్యాధునిక పార్క్ నిర్మాణం

కడప నగరంలోని ద్వారకా నగర్‌లో రూ.45 లక్షల వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక ఎకో పార్క్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్-ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఎన్-క్యాప్ (N-CAP) నిధులతో నిర్మించే ఈ పార్క్‌ను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.