ఆదిలాబాద్‌లో మీనాక్షి నటరాజన్ ఆకస్మిక పర్యటన

ఆదిలాబాద్‌లో  మీనాక్షి నటరాజన్ ఆకస్మిక పర్యటన

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గురువారం రాత్రి ఆకస్మికంగా పర్యటించారు. ఆమె పర్యటనలను కాంగ్రెస్ నాయకులు గోప్యంగా ఉంచారు. పట్టణంలోని టీటీడీసీలో ఆమె బస చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలసి మీనాక్షి నటరాజన్ శ్రమదానం చేశారు. అనంతరం నాయకులతో మాట్లాడి జిల్లా రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీసినట్లు సమాచారం.