ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
బీహార్‌లో రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. మరింత మందిని ఓటు వేసేలా వారు ప్రేరేపించాలని విజ్ఞప్తి చేశారు. బీహార్ రెండో విడత పోలింగ్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించాలని పేర్కొన్నారు.