అన్న క్యాంటీన్‌ను పర్యవేక్షించిన కలెక్టర్

NDL: నిరుపేదల ఆకలి తీర్చి పేద ప్రజలకు అండగా వుండే అన్న క్యాంటీన్‌ను కలెక్టర్ పర్యవేక్షించారు. మంగళవారం నంద్యాలలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సముదాయంలో నున్న అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆకస్మికంగా పరిశీలించారు. క్యాంటీన్లలో రోజువారీగా నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహార పదార్థాలను ఇవ్వాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు.