జాతీయ స్థాయిలో ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్ సత్తా
GNTR: జాతీయ స్థాయి PSSR పోటీల్లో ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం తృతీయ స్థానం సాధించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ చేతుల మీదుగా ట్రోఫీ, రూ.50 వేల రివార్డు అందుకుంది. ఈ బృందాన్ని డీజీపీ హరీష్‌కుమార్ అభినందించి, రూ.75 వేల నజరానా అందజేశారు. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు ప్రభుత్వం ఆధునిక పరికరాలు సమకూర్చింది.