VIDEO: మంచినీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన

VIDEO: మంచినీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట 26వ డివిజన్ ప్రజలు ఖాళీ బిందెలతో మంగళవారం నిరసనకు దిగారు. గత రెండు సంవత్సరాలుగా తమ ప్రాంతంలో సరైన మంచినీటి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను వారు డిమాండ్ చేశారు.