మంగళగిరిలో జరగనున్న పవిత్రోత్సవాలు

GNTR: మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయంలో సెప్టెంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ ఆదివారం తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా పవిత్రోత్సవాలు వైభవంగా, ఆగమశాస్త్ర ప్రకారం జరుగుతాయని ఆయన చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు.