జిల్లాలో స్టాంప్ వెండర్ల దోపిడీ
WGL: జిల్లాలో స్టాంపు వెండర్లు నాన్-జ్యుడీషియల్ స్టాంపులను రెట్టింపు ధరలకు విక్రయిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రూ.20 స్టాంప్‌ను రూ.40కి, రూ.50 స్టాంప్‌ను రూ.80కి, రూ.100 స్టాంప్‌ను రూ.140కి అమ్ముతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ సమస్య పై అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత ప్రజలు కోరారు.