మేకపాటిని కలిసిన జిల్లా అధికార ప్రతినిధి

NLR: వైసీపీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులైన సంగం మండలం తలుపూరుపాడుకు చెందిన షేక్ కరిముల్లా ఆదివారం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిని నెల్లూరులోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డిని శాలువాలతో సత్కరించి పూలబోకే అందచేశారు. తన మీద నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు మేకపాటికి ధన్యవాదాలు తెలిపారు.