'ఫ్యాక్టరీ తెరచి పనులు కల్పించాలి'

ELR: ఏలూరులో మంగళవారం ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. గౌతమీ ఫ్యాక్టరీకి చెందిన కార్మికుల సమస్యలను పరిష్కరించమని కోరితే గేటుకు తాళాలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కండ్రిక గూడెం సెంటర్ నుండి ప్రదర్శనగా బయలుదేరి అశోక్ నగర్ వంతెన మీదుగా లేబర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ రాణికి వినతిపత్రం అందజేశారు.