రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

W.G: తణుకు మండలం వెంకటరాయపురం సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పులిదిండి శ్రీనివాస్, శ్రీను ఇద్దరు కలిసి బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా మరో మోటార్ సైకిల్‌పై వస్తున్న సుమన్‌ను ఢీకొట్టారు. వీరిలో పులిదిండి శ్రీనివాస్, సుమన్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం తణుకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.