హామీని అమలు చేసే వరకు పోరుబాట

VZM: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హమీలో బాగంగా పట్టణాల్లో 2 గ్రామాల్లో 3 సెంట్లు స్థలం, ఇంటి నిర్మాణానికి 5లక్షలు హామీని అమలు చేసే వరకు పోరుబాట కొనసాగుతుందని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం 2వ రోజు నిరశన దీక్ష కార్యక్రమం స్దానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిర్వహించారు.