శ్రీవారిని దర్శించిన నటి సుహాసిని

శ్రీవారిని దర్శించిన నటి సుహాసిని

ELR: ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ సినీ, సీరియల్ నటి సుహాసిని సోమవారం దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి వచ్చిన ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ముఖ మండపంలో పండితులు ఆమెకు వేద ఆశీర్వచనాన్ని, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. పలువురు అభిమానులు ఆమెతో ఫోటోలు, సెల్ఫీలు దిగారు.