ఏసీబీ వలకు చిక్కిన ఏఈ..!

ఏసీబీ వలకు చిక్కిన ఏఈ..!

విజయనగరం జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో మెంటాడ మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ నుంచి రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితులు ఏఈ గౌతమ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ సంతోష్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.