విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించిన MLA
కృష్ణా: గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు బాలుర ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతతో పాటు ఆరోగ్యం కూడా పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని, ల్యాబ్స్ లేవని తెలియడంతో వెంటనే సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.