మానసిక ఆరోగ్యంపై ఎయిమ్స్ బృందం సర్వే

KMR: కామారెడ్డి పట్టణం LONI UPHC ఇస్లాంపూర కాలనీలో నేడు మానసిక ఆరోగ్యంపపై BB నగర ఎయిమ్స్ బృందం సర్వే నిర్వహించినట్లు డా.చందన ప్రియ తెలిపారు. ప్రజల్లోని మానసిక ఆరోగ్య పరిస్థితులపై సర్వే నిర్వహించి అంచనా వేయనున్నట్లు తెలిపారు. పలు మానసిక సమస్యలపై సర్వే బృందం సభ్యులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాల్ పోస్టర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఉన్నారు.