'విద్యుత్ సమస్యల పరిష్కారం కోసమే ప్రజా బాట'

'విద్యుత్ సమస్యల పరిష్కారం కోసమే ప్రజా బాట'

మెదక్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో గురువారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలోనే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద చెత్తాచెదారం తొలగించడంతో పాటు స్థానిక వినియోగదారుల సమస్యల పరిష్కరించారు.