HIT TV SPECIAL: చరిత్రలో ఈ రోజు ప్రాముఖ్యత.!
E.G: బిపిన్ చంద్ర పాల్ 1907 ఏప్రిల్ 19 ఇదే రోజున రాజమండ్రిని సందర్శించారు. ఆయన ఏప్రిల్ 24 వరకు రాజమండ్రిలో ఉండి, వందేమాతరం, స్వరాజ్, స్వదేశీ ఉద్యమాలపై ఐదు ప్రసంగాలు ఇచ్చారు. సందర్శన తర్వాత రాజమండ్రి, కాకినాడలో వందేమాతరం నినాదాలు, బ్యాడ్జీలు ధరించడం, విద్యార్థుల సమ్మెలు తీవ్రమయ్యాయి. ఇది ఉమ్మడి తూర్పు గోదావరిలో స్వదేశీ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేసిన ముఖ్య ఘటన.