VIDEO: కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

NZB: నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించారు. అనంతరం అధికారులు, ఉద్యోగులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు.