VIDEO: ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: ఎమ్మెల్యే
SRPT: రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మంగళవారం తుంగతుర్తిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. సన్నాలు పండిస్తున్న రైతులను ప్రోత్సహించడానికి క్వింటాకు రూ.500ల బోనస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు.