'ప్రజావాణి ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి'
JGL: ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని పలు మండలాల నుంచి ప్రజలు వినతులు సమర్పించారు. మొత్తం 123 ఫిర్యాదులు అందగా, వాటిపై సమగ్ర విచారణ చేసి పెండింగ్ లేకుండా తక్షణమే పరిష్కరించాలని ఆయన సూచించారు.