మహిళలను బస్సులకు ఓనర్లు చేస్తాం: మంత్రి
MLG: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కాదు.. బస్సులకు ఓనర్లను చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. అభయహస్తం నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం కాజేసిందని మండిపడ్డారు. మహిళలతో పెట్టుకున్న వారు బాగుపడిన వారు లేరన్నారు. సొంతింటి ఆడబిడ్డ ఘోస పడుతుందని కేసీఆర్, కేటీఆర్‌కు ఇది తగునా అని ప్రశ్నించారు.